Sunday, July 31, 2016

కొత్త కొత్త బాష ...

కొత్తగా మాటలు నేర్చుకున్న బిడ్డ బాష ఒక్క తల్లికి మాత్రమే అర్ధమవుతుది, ఏందుకంటె అది బిడ్డ కళ్ళు పలికే అమ్మ మనసు వినే బాష..కోవిద్ చాలా మాట్లాలాడుతున్నాడు, నాకు వాడి  బాష అర్ధమైతే క్యూస్షన్ బ్యాంకు అవుంతుందేమో అని అనిపితుంది, నిఖిలకి మాత్రం ఓ పి.సుశీల గానంలా వినిపిస్తుంది.

అక్షరాలు లేవు ...
డిక్షనరీలు లేవు...

ఆశలెన్ని వున్నా..
అచ్చు వేయలేవు ...

పిచ్చి పిచ్చి బాష ...
అచ్చమైన బాష ...

నవ్వులోని బాష ..
కళ్ళలోని బాష ...

అందమైన బాష ..
వెన్నలాంటి బాష ..

బిడ్డ పలికే బాష ... 
అమ్మ బాష!

- వంశీ

Sunday, July 17, 2016

A Parada between You & Your life..

Starting your day glancing lifeless mobile screen? You made any attempt to count how many hours you stare at 'any' screens a day? Did you felt, you are checking for missed call or unread message when you are not expecting one? ... Ever, you felt a vibration without one in your pocket.

Gravity subsist in transforming ideas to actions, happily struggled in putting some action in play for a year in avoiding electronic screens in my life, using a real or not-so-hitech alarm, instead mobile alarm. Bed Time - A Electronic free Zone. Pre-sleep routine, "Real life heroes" article in Readers Digest magazine. Started maintaining Personal Collage and Stopped Facebook, checking What's app once a day or when ever necessary. Keep mobile in Vibration all time, DND at nights. Strictly follow No Screen time for few hours every day - No Tv, No mobile, No PC just people, books and life. Shifted my-view on "inbox" as To-Do list coming from others, I sort and read emails 3 or 4 times a day, vs all day.

Lets love people and use devices not the opposite.

How many hours you stare at life less devices and ignore lovely beautiful hearts around you? 

Sunday, July 10, 2016

ఇలా మొదలయింది! ఒక చిరు కోపం...

"ఏంటి కోవిద్ అది?"
"దా దా .. "

నోటికి దగ్గరగా తీసుకున్నాడు ... 

"ఓయ్ ఏం చేస్తున్నావ్?"
"వూ ... "

నోట్లో పెట్టుకున్నాడు. 

"ఒరేయ్ అతి నా కొడకా !!" 
తన నోట్లో నా వేలు పెట్టి ఆ చెత్తఏమిటో తీయాలి అనుకున్నా, నన్ను తోసేసాడు. 

ఇంతలో... 
ఓ సొట్ట మూతి.. 
కళ్ళలో ఓ రెండు కన్నీటి ముత్యాలు.. 
రెండు పసిపాదాలు పుడమిని క్రిందకు తోసాయి.. 
లేలేత తాటి నుంజులు, ఆ బుగ్గలు, గజ గజ వోణికాయి.. 
కొత్తగా వచ్చిన పాల పళ్ళను గట్టిగా కొరికాడు... 
లేతపిడికిళ్లు బిగుసుకోనాయి.. 
చూపు దేనిపైపో వెతుకు...
ఓ చిరు తుఫాను బలపడింది.. 
రెప్పపాటులో నా చుపుడు వేలును తీసుకొని, కోరికేశాడు, కాస్త రక్తం వచ్చింది.

ఆ రోజు నాకు అర్థమైంది, కొడుక్కు కోపం వస్తుంది. రోజంతా ఆలోచన. 

తనకు నచ్చనిది చేయనివ్వక పోతే కొడుక్కి, నాన్న మీద కోపం వస్తుంది, చాలా ఎక్కువగా వస్తుంది. అది తన మంచి కొసమె అని తెలుసుకోవడానికి ఒక తరం పడుతుంది. మా నాన్న మీద నాకు గౌరవం వచ్చిన రోజులకన్నా, కోపం వచ్చిన రోజులే చాలా ఎక్కువ. నన్ను కొట్టిన ప్రతిసారి కోపంతో ఊగిపోయివాడిని. క్రికెట్ ఆడుకోనివ్వడు , అప్పుచేయనివ్వడు, చదువుకోమంటాడు, టీవీ, ఫోన్ వొదంటాడు ఇలా ఎన్నో గుర్తుకు వచ్చి ఆ రాత్రి, నా చేయి కోవిద్ కి దగ్గరగా పెట్టుకొని, నిద్ర పోయా...

- వంశీ 

Reflection # 1 - Sep 26th

Everything work when reset . This certainly applies to human & human relations as well. Managing Kids & their schedules, Managing f...