ఆయుధప్రేమ?
అరాచక..అమానుష..అతిక్రూర...“ఆయుధం”
అమృతతుల్యం..జీవనపరమార్థం..ఆనందం ..“ప్రేమ”
‘ప్రేమ’ రోజున ఓ బిడ్డకు ఆయుధాన్నిచ్చి, పదుల కుటుంబాలకు ప్రేమను దూరం చేసిందెవరు?
ప్రోధున బిడ్డలకు ముద్దులిచ్చి పంపిన తల్లికి, రేయికి శవాన్ని మిగిల్చిందెవ్వరు?
గువ్వలా రివ్వున ఎగరవలసిన పిల్లల భవితను గాలిలో కలిపేసిందెవ్వరు?
బతుకును సైతం చావులా బ్రతకమని, చావుతప్పి బతికిన పిల్లల మనస్సుని శపించిందెవ్వరు?
తమ “ప్రాణాలను” ఎర్రటి నెత్తుటిలో చూసుకొని, తమ “ఆశలను” శవాలుగా మోసుకొంటున్న తల్లి తండ్రుల బ్రతుకుకు అర్ధం చెప్పేవారెవరు?
రాజ్యమా, నీకు పట్టిన ఆయుధ జాడ్యయాకి బదులివ్వు, బిడ్డలను బ్రతకనివ్వు.
- ఓ తండ్రి