Saturday, January 14, 2012

బుజ్జి కల..

తారిఖు 10.01.2011- మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ అందరు Send ఆఫ్ ఇవటానికి వచ్చారు .. కానిస్టేబుల్ టికెట్ చూసి ఫ్లైట్ ౩:౩౦ am కి, మీ ఫ్యామిలీ వాళ్ళు వున్నారు కదా కాసేపు టైం స్పెండ్ చేయండి అని సలహా ఎచాడు, బుజ్జి గాడు కంగారుగా  అమ్మ, అక్క, బావ, అవ్వ దగరకు వెళ్లి మీరు బయలుదేరితేయ్ నేను బయలుదేరుతాను అని చెప్పి తన ప్రయాణానికి తోలి విఘ్నంలా అనిపించినా కానిస్టేబుల్  దగరకు వెళ్లి... కళ్ళలో సూటిగా చూడలేక మళ్ళి టికెట్ కాగితం చూపించాడు, ఈ సారి కానిస్టేబుల్ గారు "బుజిగారు ఇప్పుడు టైం 12:౦౦ ఏ కదా" అని ఏదో చేపబోతేయ్ ... వాళ్ళు వెళ్లి పోయారు సర్ అని చెపి టికెట్ లాగేసుకుని లోపలి వెళ్ళిపోయాడు!

టైం 2:30 : బుజ్జి గాడు ఏ విషయంలో కంగారు పడాలో తేలిక కంగారు పడుతూ రెండున్నర గంటలు గడిపేసాడు... 

చెక్ ఇన్ కౌంటర్ లో ఎయిర్ లైన్స్ స్టాఫ్, చాల చక్కగా డ్రెస్ వేసుకొని తలకు నువ్నే రాసుకొని నుదుట బొట్టు పెటుకొని, తన టైం షిఫ్ట్ షెడ్యూల్ చదువుకొంటూ వరుసలో మొదట (చివర కూడా) నిలుచున బుజ్జిని చూస్తూ, కాస్త నవుతూ, నువ్వు నా మొదటి ప్రాయనికుడివి అన్నటు కళ్ళతో చెబుతూ, ఇంకో రెండు నిముషాలు అన్నటు చెయ్ చూపించాడు!! బుజ్జి గాడు కంగారు పడ్డాడు. తరువాత అర్ధం చేసుకునాడు!

ఆ రెండు నిమిషాల్లో గత రెండు సంవస్త్సరాలను నేమరువేసుకొంటు గడిపాడు... బుజ్జిగాడు మొదటిసారి ఫ్లైట్ ఎక్కుతునాడు, అమెరికాలో Onsite కోసం చాల వెయిట్ చేసి, సీనియర్ ప్రాజెక్ట్ స్తఫ్ట్ తో బాగా నెట్వర్క్ నడిపి చివరకు అవకాశం ప్రాజెక్ట్  మేనేజర్ లా వచ్చి, "కంగ్రాట్స్ యు అరె గోయింగ్ మయామి ఫ్లోరిడా" అని గట్టిగ కరచాలనం చేసాడు... బుజ్జిగాడు ఆనందం తో వుగిపోయాడు... వరుసలో కొత్తగా వుచిన వ్యక్తి బుజ్జిని చెక్ ఇన్ కే టైం అయీన్ది అని బుజ్జం  పట్టుకొని వుపుతునాడు. 

ఎయిర్ లైన్స్ స్టాఫ్ : "సర్, మీ టికెట్స్ పాస్ పోర్ట్ ప్లీజ్".

గత రెండు గంటల నుండి జేబులో వాటిని వెళ్ళతో తాకుతున్న బుజుగాడు, కంగారు పడకుండా, స్టాఫ్ గారికి టికెట్స్ పాస్ పోర్ట్ ఇచ్చాడు.

టికెట్ ఫాంట్ సైజు ౩ లో వున్నటు కళ్ళు చిన్నవి చేసి టికెట్ చూసి, పెనం మీద మసాల దోసాల ఎరుపెక్కాడు.

నుదిటి మీద వున్నా కుంకుమ చుట్టూ చెమటలు పట్టి, కుంకుమ ఘన స్తితి నుండి ద్రవ స్తితి కి మారింది. సరిగా ఎవరో పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి కల్చినాటు వుంది బాకర గారి మొహం.

"మీరు?"
"బుజ్జి"

"బుజ్జి, మీరు అమెరికా వెళ్తునార?"
"అవును."

"మయామి ఫ్లోరిడా వయ దుబాయ్."
ఈ సరి నవ్వు నటిస్తూ, "అవును. "

"మీ టికెట్ ..."
&6;*^#౮౯౨౦౯౮౭ఉ౭౮9 -- బుజ్జి గాడి బుర్ర లో గాడిద లు పెరిగేడుతునాయే.

"మీ ఫ్లైట్ఊ ...మీ ఫ్లైట్ ... నిన్నే వెలిపొఇన్ది సర్...!!"
బుజిగాడు నవ్వాడు, కంగారు ఎలా పడాలో మరచి పోయాడు...

"ప్లీజ్ మీ టికెట్ లో డేట్ చుడండి" అని, ఎర్ర సిరాతో డేట్ కింద రెండు సారూ గీకి, బుజిగారికి చూపించాడు.

గతం... జనవరి 8 2011 క్రీస్తు జననం  తరువాత - 
బుజిగాడు బుజ్జిపల్లి  నుండి - "సర్ నాకు టికెట్స్ ఇంకా రాలేదు".
కంపెనీ స్టాఫ్ Bangalore నుండి -- "సర్ మీరు ఎపుడు బయలు దేరుతునారు".

"రేపు" (బుజ్జిపల్లి నుండి అని చేపడం అనవసం అనుకునాడు).
"సారీ సర్ లేట్ ప్రాసెస్సింగ్ కి క్షమించండి, మీకు టికెట్స్ ఇష్యూ చేస్తున్నాం, రేపటికి"
ఇంకా ఏదో చెబుతుండగా, థాంక్స్ అని చెప్పి బుజ్జి గాడు కాల్ కట్ చేసాడు.

అమ్మ దగ్గరకు వెళ్లి, రేపు ప్రయాణం కార్ లో వెళ్దాం, అందరు, అని చెప్పి బాబాయ్ (బుజ్జి మిత్రుడు) తో పాణి పూరి తెనడానికి, PC ఆన్ చేస్తూ రెడీ అయ్యాడు...

ఈ మెయిల్ - "3:౩౦ AM, To Miami From Bangalore Airport" అని చదివేసి డేట్ గురించి అసలు ఆలోచన లేకుండా  పనిపురి గురించి ఆలోచిస్తూ ఆనందంగా, "Itinerary Accepted" క్లిక్ చేసి,  వెళ్ళిపోయాడు. కాని టికెట్ లో Date: Jan 9th 2011..

"బుజ్జిగారు బుజ్జిగారు" అని మిక్రోఫోనే లేకుండా అరుస్తూ, బుజ్జి మొహం లో మొహం పెట్టి వాస్తవం లోకి బుజ్జి ని లకోచారు స్టాఫ్. 

బుజ్జి - "సర్ ఇంకో సారి చెక్ చేయండి. టికెట్ మీద ఆచ్చు తప్పు పడింద్యేమో."
స్టాఫ్ గారు - "ఆచ్చు తాప్పా"...

"మీ ఫ్లైట్ వెళ్లి పొయింది సర్, మీకు రెండురోజుల తరువాత ఫ్లైట్ వుంది"
"సర్ ఇది నా మొదటి సారి ప్రయాణం, ఎలాగయినా.."
"చాల రోజులనుండి వెయిట్ చేస్తునా.."
"డేట్ కూడా చదవకుండా టికెట్స్ ఎలా తెసుకోనావ్ అని అందరు నవ్వుకొంటారు..మరీ ముఖ్యంగా నా గర్ల్ ఫ్రెండ్ దగ్గర పరువు?"
" చాల పూర్ ఫ్యామిలీ సర్..."
తరువాయి గంట, ఇలాంటివి ఎన్ని చెప్పనా ఉపయోగం లేకపోయంది.

మళ్ళి కంపెనీ ప్రయాణ సంభందిత డిపార్టుమెంటు కి ఫోన్ చేసి టికెట్స్ మార్చాలి అని చెపి రిక్వెస్ట్ చేసి, తరువాత మరో ఫ్లైట్ కి ఆ రోజయే ప్రయాణం చేయడం తో బుజ్జి గాడి, కలలాంటి ప్రయాణం మరిచిపోలీని పీడా కలలాంటి నిజం పూర్తీ అయింది.

వెనుక మాట - ఏ పని చేసిన పూర్తిగా పూర్తి చేయాలి. టికెట్ చదవటం వో ఉదాహరణ మాత్రమే. 

మీ
వంశీ

2 comments:

adansuba said...

Mohan, Good one. Keep it flowing...

adansuba said...

Mohan, Good one. Keep it flowing...

Reflection # 1 - Sep 26th

Everything work when reset . This certainly applies to human & human relations as well. Managing Kids & their schedules, Managing f...