Sunday, July 31, 2016

కొత్త కొత్త బాష ...

కొత్తగా మాటలు నేర్చుకున్న బిడ్డ బాష ఒక్క తల్లికి మాత్రమే అర్ధమవుతుది, ఏందుకంటె అది బిడ్డ కళ్ళు పలికే అమ్మ మనసు వినే బాష..కోవిద్ చాలా మాట్లాలాడుతున్నాడు, నాకు వాడి  బాష అర్ధమైతే క్యూస్షన్ బ్యాంకు అవుంతుందేమో అని అనిపితుంది, నిఖిలకి మాత్రం ఓ పి.సుశీల గానంలా వినిపిస్తుంది.

అక్షరాలు లేవు ...
డిక్షనరీలు లేవు...

ఆశలెన్ని వున్నా..
అచ్చు వేయలేవు ...

పిచ్చి పిచ్చి బాష ...
అచ్చమైన బాష ...

నవ్వులోని బాష ..
కళ్ళలోని బాష ...

అందమైన బాష ..
వెన్నలాంటి బాష ..

బిడ్డ పలికే బాష ... 
అమ్మ బాష!

- వంశీ

No comments:

Reflection # 1 - Sep 26th

Everything work when reset . This certainly applies to human & human relations as well. Managing Kids & their schedules, Managing f...